కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సందర్శించిన సీఎం కేసీఆర్

Update: 2020-02-13 18:53 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీ బరాజ్‌ను కేసీఆర్ పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా లక్ష్మీ జలాశయాన్ని వీక్షించారు. ప్రాణహిత వద్ద నదీ జలాలను పరిశీలించారు. నీటి నిర్వహణపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్షించారు. అనంతరం కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆఫీసుకు చేరుకున్నారు. అక్కడ జిల్లా అభివృద్ధి సహా ఇతర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష చేపట్టారు.

లక్ష్మీ బరాజ్ సందర్శనకు ముందు కాళేశ్వర క్షేత్రాన్ని సందర్శించారు. ముక్తేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కేసీఆర్‌ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు. అంతకుముందు పుష్కరఘాట్‌లో గోదావరిమాతకు కేసీఆర్ పూజలు చేశారు. గోదావరిలో నాణేలు వదిలి, చీర-సారె సమర్పించారు. అనంతరం కాళేశ్వరం ఆలయానికి వెళ్లగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు.

Similar News