CBN: "విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నాదీ బాధ్యత"

ముస్తాబు కార్యక్రమాన్ని ఆరంభించిన సీఎం

Update: 2025-12-20 10:30 GMT

ప్ర­భు­త్వం ఏ కా­ర్య­క్ర­మం చే­ప­ట్టి­నా అది తా­త్కా­లి­క­మే అవు­తుం­ద­ని, అం­దు­లో ప్ర­జ­లు భా­గ­స్వా­ము­లై­తే­నే అది శా­శ్వ­త­మ­వు­తుం­ద­ని సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు. అన­కా­ప­ల్లి జి­ల్లా పర్య­ట­న­లో ఉన్న ఆయన తా­ళ్ల­పా­లెం­లో ని­ర్వ­హిం­చిన ‘స్వ­ర్ణాం­ధ్ర- స్వ­చ్ఛాం­ద్ర’ కా­ర్య­క్ర­మం­లో పా­ల్గొ­న్నా­రు. అం­ద­రి ఆరో­గ్యం కోసం చే­ప­ట్టే కా­ర్య­క్ర­మా­ల్లో ప్ర­జ­లు భా­గ­స్వా­ము­లు కా­వా­లి. యూ­జ్‌ రి­క­వ­రీ, రీ­యూ­జ్‌ వి­ధా­నం­తో ముం­దు­కె­ళ్లా­లి. వా­డిన ప్లా­స్టి­క్‌ ఇస్తే డబ్బు ఇచ్చే­లా చూ­స్తు­న్నాం. వ్య­ర్థా­ల­ను వన­రు­గా, ఆస్తి­గా మా­రు­స్తు­న్నాం. ఉత్తమ పా­రి­శు­ద్ధ్య కా­ర్మి­కు­ల­కు అవా­ర్డు­లు ఇస్తు­న్నాం. వచ్చే ఏడా­ది జూ­న్‌ నా­టి­కి ఏపీ­ని ప్లా­స్టి­క్‌ రహిత రా­ష్ట్రం­గా మా­రు­స్తాం. ఇప్ప­టి­కే సచి­వా­ల­యం­లో ప్లా­స్టి­క్‌ వా­డ­కుం­డా చర్య­లు చే­ప­ట్టాం. గత ప్ర­భు­త్వం వది­లిన 86 లక్షల టన్నుల చె­త్త­ను తొ­ల­గిం­చాం. రీ­సై­క్లిం­గ్‌ యూ­ని­ట్లు ఏర్పా­టు చే­స్తు­న్నాం. జన­వ­రి 26 నా­టి­కి ఏ రో­డ్డు­పై­నా చె­త్త కని­పిం­చ­కూ­డ­దు.’’ అన్నా­రు.

అన­కా­ప­ల్లి జి­ల్లా తా­ళ్ల­పా­లెం­లో ఏపీ సీఎం చం­ద్ర­బా­బు పర్య­టిం­చా­రు. అక్క­డి గు­రు­కుల పా­ఠ­శా­ల­లో ‘ము­స్తా­బు’ కా­ర్య­క్ర­మా­న్ని ప్రా­రం­భిం­చా­రు. వి­ద్యా­ర్థు­ల­తో మా­ట్లా­డి వి­విధ అం­శా­ల­పై చర్చిం­చా­రు. పి­ల్లల బం­గా­రు భవి­ష్య­త్తు­కు తనది బా­ధ్యత అని సీఎం పే­ర్కొ­న్నా­రు. రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా అన్ని పా­ఠ­శా­ల­ల్లో శని­వా­రం ము­స్తా­బు కా­ర్య­క్ర­మా­న్ని ప్రా­రం­భిం­చా­రు. వి­ద్యా­ర్థు­ల్లో వ్య­క్తి­గత పరి­శు­భ్రత పట్ల అవ­గా­హన పెం­చే­లా దీ­న్ని చే­ప­ట్టా­రు. ప్ర­భు­త్వ, ప్రై­వే­టు పా­ఠ­శా­ల­ల్లో అమలు చే­స్తు­న్నా­రు. మరో­వై­పు చం­ద్ర­బా­బు తా­ళ్ల­పా­లెం­లో పా­రి­శు­ద్ధ్య కా­ర్మి­కు­ల­తో కలి­సి కా­లి­న­డ­కన వె­ళ్లి గ్రా­మం­లో స్వ­చ్ఛత పను­ల­ను పరి­శీ­లిం­చా­రు. అం­త­కు ముం­దు తా­ళ్ల­పా­లెం వచ్చిన చం­ద్ర­బా­బు­కు తె­దే­పా నా­య­కు­లు ఘన స్వా­గ­తం పలి­కా­రు. హె­లి­ప్యా­డ్ వద్ద ఆయ­న­కు స్పీ­క­ర్ అయ్య­న్న­పా­త్రు­డు, హోం మం­త్రి అనిత, అన­కా­ప­ల్లి జి­ల్లా ఇన్‌­ఛా­ర్జి మం­త్రి కొ­ల్లు రవీం­ద్ర, ఎమ్మె­ల్యే బం­డా­రు సత్య­నా­రా­య­ణ­మూ­ర్తి తది­త­రు­లు స్వా­గ­తం పలి­కా­రు.

Tags:    

Similar News