రవి అస్తమించని రాజ్యంలో.. తుపాన్లు కూడా అస్తమించడం లేదు

Update: 2020-02-17 16:39 GMT

వరుస తుపాన్లతో బ్రిటన్ వణికిపోతోంది. తాజాగా డెన్నిస్ సైక్లోన్‌ యూకేను అతలాకుతలం చేస్తోంది. తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. నదులు, సరస్సులు పొంగిపొర్లుతున్నాయి. సమీప ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. సౌత్‌వేల్స్ ప్రాంతంలో ఒక వ్యక్తి నదిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. అబెర్డరన్‌ ప్రాంతంలో గంటకు 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. టాఫ్‌ నదిలో వరద ఉద్ధృతి పెరగడంతో నీళ్లు తీరాన్ని దాటి ప్రవహిస్తున్నాయి. దాంతో టాఫ్ నది చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.

సౌత్‌వేల్స్ సహా పలు ప్రాంతాల్లో తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. వరదలు, కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తుఫాన్‌ ప్రభావం రైళ్ల రాకపోకలపైనా పడింది. సహాయక చర్యలు చేపట్టడానికి సైన్యం కూడా రంగంలోకి దిగింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Similar News