ఐపీఎస్ ఆఫీసర్లకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

Update: 2020-02-20 19:01 GMT

మధ్యప్రదేశ్‌లో ఐపీఎస్ ఆఫీసర్లకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బోటు ప్రమాదం నుంచి ఐపీఎస్ ఆఫీసర్లు, వారి కుటుంబసభ్యులు తప్పించుకున్నారు. నదిలో మునిగిపోయే ప్రమాదం ఏర్పడగా, తోటి ఆఫీసర్లు వేగంగా స్పందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. భోపాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆఫీసర్లు, కుటుంబసభ్యులు లైఫ్ జాకెట్లు ధరించడంతో ఎవరికీ ప్రాణాపయం జరగలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.

భోపాల్‌లో ఐపీఎస్ ఆఫీసర్ల కాంక్లేవ్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా అడ్వెంచర్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేశారు. అందులో నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లు, కుటుంబసభ్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతుండగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ బోటు ప్రమాదవశాత్తూ తిరగబడింది. దాంతో ఆ పడవలో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. అందులో మధ్యప్రదేశ్ డీజీపీ విజయ్ కుమార్ సింగ్ భార్య కూడా ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇతర బోట్ల సాయంతో ఆఫీసర్లు, వారి కుటుంబసభ్యులను రక్షించారు.

Similar News