చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఓ మూడంతస్తుల భవనం ఉన్నట్టుండి కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని ఖమత్‌రాయి ప్రాంతంలో ఉన్న ఈ భవనం పక్కనే మరో బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది. పునాదుల కోసం లోతైన తవ్వకాలు జరపడంతో.. పక్కనే ఉన్న భవనం బలహీనపడింది. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.