రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై హైకోర్టులో విచారణ

Update: 2020-02-26 16:03 GMT

రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలపై బుధవారం మద్యాహ్నం హైకోర్టు విచారణ జరగనుంది. తాము అమరావతి కోసం ఇచ్చిన భూములను అభివృద్ది చేయకుండా, ఇక్కడి నుంచి రాజధానిని తరలిస్తూ, ఆ భూములను పేదలకు పట్టాలుగా ఇస్తామనడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. దీనిపై రైతులతోపాటు న్యాయవాదులు కూడా కోర్టును ఆశ్రయించడంతో దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది.

అటు, సీఆర్‌డీఏ రద్దు, 3 రాజధానుల బిల్లు సహా.. కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై ఉదయం హైకోర్టులో విచారణ జరిగింది. జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదికలు తమకు ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాదిని హైకోర్టు కోరింది. తదుపరి విచారణ వచ్చే నెల 30కి వాయిదా వేసింది.

Similar News