ప్రతి వెయ్యి మంది నవజాత శిశువుల్లో 300 మంది వినికిడి లోపం : మంత్రి ఈటెల
ప్రతి వెయ్యి మంది నవజాత శిశువుల్లో 300 మంది వినికిడి లోపంతో బాధపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది అన్నారు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్. హైదరాబాద్ KPHBలోని డాక్టర్ రావూస్ ENT ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జన్యు పరంగా, పుట్టుకతో వచ్చే లోపాల వల్ల, మాతృత్వ సమయంలో తల్లులు సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల పిల్లలకు వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉందని డాక్టర్ జీవీఎస్ రావు తెలిపారు. వినికిడి లోపం నివారణ దినోత్సవంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాకథాన్ నిర్వహించినట్లు చెప్పారు.