పవన్ గుప్తా క్షమాబిక్ష పిటిషన్ తిరస్కరణ

Update: 2020-03-04 16:22 GMT

నిర్భయ కేసులో దోషిగా తేలిన పవన్ గుప్తాకు అన్ని దారులు మూసుకుపోయాయి. ఇటీవల సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేశారు.. తాజాగా అతను పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ను కూడా భారత రాష్ట్రపతి తిరస్కరించారు. నిర్భయ కేసులో నలుగురు మరణశిక్ష దోషులలో ఒకరైన గుప్తా సోమవారం క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు (ఎస్సీ) కొట్టివేసిన కొద్ది గంటలకే భారత రాష్ట్రపతి ముందు తాజా క్షమాబిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. దాంతో ఉరి వాయిదా పడింది. మరో ముగ్గురు దోషుల దయ పిటిషన్లు ఇప్పటికే కొట్టివేశారు. వాస్తవానికి నిందితులకు ఈనెల 3న ఉరి శిక్ష విధించాల్సి ఉన్నా పవన్ కుమార్ క్షమాబిక్ష పిటిషన్ పెండింగ్ నేపథ్యంలో మరోసారి వాయిదా పడింది. అయితే తాజా పరిణామాల తరువాత పటియాలా హౌజ్ కోర్ట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Similar News