రైతు బంధు పథకంతో అన్నదాతల్ని ఆదుకుంటున్నామని.. బడ్జెట్‌పై జరిగిన చర్చలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించలేదన్నారు. బడ్జెట్‌పై ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. దేశంలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నది తెలంగాణ మాత్రమే అన్నారు హరీశ్‌రావు. గతంలో రైతులు చనిపోతే ఆ కుటుంబాలను అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కనీసం పరామర్శించలేదన్నారు.