కరోనా కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. విదేశీ ప్రయాణికులపై ప్రధానంగా ఫోకస్ చేసింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 4 థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేశారు. 98 డిగ్రీల కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉన్న ప్రయాణికుల ముఖం ఇందులో ఎరుపు రంగులో కనిపిస్తుంది. వెంటనే డాక్టర్ల సూచన మేరకు వారిని 108 వాహనం ద్వారా గాంధీ ఆస్పత్రికి గానీ.. ఫీవర్ హాస్పిటల్‌కు గానీ తరలిస్తున్నారు.