అసెంబ్లీలో కరోనా అలర్ట్ పై మాటల తూటాలు పేలాయి. కరోనాపై అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ హై అలర్ట్ ప్రకటించారు. దీనిపై స్పందించిన ఎల్పీ నేత భట్టి కరోనా కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పారాసెట్మల్ వేసుకుంటే తగ్గిపోతుందని గతంలో కేసీఆర్ చెప్పారని సెటైర్ వేశారు. భట్టి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ప్రతిదాన్ని రాజకీయం చేస్తా ఎలా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దంటూ హెచ్చరించారు.