కడపలో బెదిరింపులతో జెడ్పీ పీఠం వైసీపీ ఖాతాలోకి

Update: 2020-03-15 12:28 GMT

కడపలో ప్రత్యర్థులకు బెదిరింపులతో జెడ్పీ పీఠం వైసీపీ ఖాతాలోకి వెళ్లింది. కడపలో 50 జెడ్పీటీసీ స్థానాలకు 35 ఏకగ్రీవం అయ్యాయి. అంటే ఎన్నికలకు ముందే వైసీపీ వశమైంది. మిగతా చోట్ల పోటీ ఉన్నా అక్కడ కూడా స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయా అంటే ఔనని చెప్పలేని పరిస్థితి. కర్నూలు జిల్లాలో 804 ఎంపీటీసీలకు 312 ఏకగ్రీవం అయ్యాయి. వీటిల్లో అత్యధికంగా 266 వైసీపీ ఖాతాలో పడ్డాయి. టీడీపీకి 43, బీజేపీకి 2 దక్కాయి. జిల్లాలో 53 జెడ్పీటీసీల్లో 16 ఏకగ్రీవం అయ్యాయి. వాటిల్లో కూడా మెజార్టీ వైసీపీకే దక్కాయి.

నెల్లూరు జిల్లాలో 46 జెడ్పీటీసీల్లో 12 ఏకగ్రీవం అయ్యాయి. అన్నీ వైసీపీకే వచ్చాయి. ప్రకాశం జిల్లాలో 55 జెడ్పీటీసీల్లో 14 ఏకగ్రీవం కాగా, విజయనగరం జిల్లాలో 34 జెడ్పీటీసీల్లో 3 ఏకగ్రీవం అయ్యాయి. విజయనగరంలో 549 ఎంపీటీసీలకు గాను 55 ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవం అయిన ప్రతిచోటా బెదిరింపులో, బలవంతంగా నామినేషన్‌ విత్‌డ్రా చేయించడమో జరగడం పట్ల విపక్షాలు భగ్గుమంటున్నాయి.

చిత్తూరులో టీడీపీ నేతల్ని వైసీపీ హెచ్చరికలు కంగారుపెట్టాయి. నిన్న 140 మందితో బలవంతంగా విత్‌డ్రా చేయించిన వైసీపీ లీడర్లు.. ఏకగ్రీవాల కోసం ఎంత కుట్రలు చేయాలో అంతా చేశారు. చిత్తూరులో 66 జెడ్పీటీసీలకు 29 ఏకగ్రీవం కాగా అన్నీ వైసీపీ ఖాతాలోకే పడ్డాయి.

Similar News