తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా కొన్ని ఆదేశాలు జారీ చేసినా.. సూచనలు చేసినా.. కొందరు వ్యాపారులు పట్టించుకోలేదు. దీంతో.. GHMC ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. మూసివేయకుండా తెరిచి ఉంచి పలు స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, ఫుడ్ కోర్టులు, మాల్స్, జిమ్‌లను సీజ్ చేశారు. మంగళవారం ఒక్కరోజే 66 సంస్థలపై గ్రేటర్ కొరడా ఝులిపించారు.