పూర్తిగా ఇంటికే పరిమితమైన కాలిఫోర్నియా ప్రజలు

Update: 2020-03-20 19:09 GMT

కరోనా ప్రభావంతో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజలంతా నిర్భందంగా ఇళ్లకే పరిమితం కావాలని గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆదేశాలు జారీచేశారు. వైరస్ కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 19మంది మరణించారు. 900మందికి వైరస్ సోకింది. పరిస్థితి దయనీయంగా మారడంతో గవర్నర్ ఈ ఆంక్షలు విధించారు. దీంతో కోటిమంది జనాభా ఇళ్లకే పరిమితం కానున్నారు. ఇందుకోసం 150 మిలియన్ డాలర్లను అత్యవసర నిధిని విడుదల చేసినట్లు తెలుస్తోంది. నివాసం లేనివారితోపాటు, వైద్యపరీక్షలకోసం ఉపయోగించనున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించిన వారి సంఖ్య 10వేలకు చేరింది.

Similar News