జనతా కర్ఫ్యూ కార్యక్రమానికి సన్నద్ధంగా ఉండాలి: బండి సంజయ్

Update: 2020-03-21 20:31 GMT

ప్రజలంతా అప్రమత్తంగా ఉండి.. కరోనాపై ప్రతి ఒక్కరు యుద్ధం ప్రకటించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ కార్యక్రమానికి సన్నద్ధంగా ఉండాలని ప్రజలను, పార్టీ శ్రేణులకు సూచించారు. కరోనా నివారణకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు బండి సంజయ్‌. కరీంనగర్‌లో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను కలిసినవారు స్వచ్ఛందంగా బయటికి రావాలన్నారు. ప్రభుత్వమే వారికి చికిత్స అందించి రక్షణ కల్పిస్తుందని బండి సంజయ్ తెలిపారు.

Similar News