కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు

Update: 2020-03-25 19:15 GMT

కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు పోలీసులు. ప్రజలు, వైద్య విభాగం, పారిశుద్ధ్య విభాగం, నిత్యావసర వస్తువుల విక్రయం, అత్యసవర విభాగాలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, కూరగాయల మార్కెట్లకు వచ్చే ప్రజలకు శానిటైజర్స్, మాస్కులు అందిస్తున్నారు. సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. బయటి ప్రదేశాల్లో ఎక్కువ సేపు ఉండకూడదని.. అనుమానం వస్తే 100 లేదా 104 కు డయల్ చేయాలని చెబుతున్నారు.

Similar News