ఎన్ని చెప్పినా.. మారని పోలీసుల వైనం.. పాలు సరఫరా చేసే రైతుపై జులుం

Update: 2020-03-28 15:14 GMT

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొందరు పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డుపై వచ్చారంటూ గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. ఇటీవలే ఉన్నతాధికారులు ఇలాంటి వారి పట్ల చర్యలు తీసుకుంటున్నా.. కొందరు పోలీసుల్లో మార్పు రావడం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. పాలు సరఫరా చేసే రైతుపై జులుం ప్రదర్శించారు. బయటకు ఎందుకు వచ్చావంటూ విచక్షణ రహితంగా కుల్ల బొడిచారు. తాను రైతును అని ఎంత చెప్పిన వినిపించుకోలేదు. పోలీసుల దాడిలో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. తల పగిలి తీవ్ర రక్త స్రావమైంది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. గుంటూరు జిల్లా నగరికల్‌ మండలం నర్సింగ్‌పాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది.

Similar News