నిత్యావసరాల రేట్లు పెంచితే.. జైలుకే: సీఎం జగన్

Update: 2020-03-29 17:12 GMT

అర్బన్ ప్రాంతాలలో లాక్‌డౌన్‌ సమయం కుదించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 నుంచి ఉదయం 11 వరకే నిత్యావసరాలకు అనుమతివ్వాలని సూచించారు. మిగతా ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి ఒంటిగంట వరకే పర్మిషన్ ఇవ్వాలని చెప్పారు. లాక్‌డౌన్‌ పగడ్బందీగా అమలు చేయాలని ఆదేశిచారు. నిత్యావసరాల రేట్లు పెంచితే.. జైలుకేనని సీఎం హెచ్చరించారు. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక, కాల్‌ సెంటర్‌ నెంబర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు, ఆక్వా రైతులకు కనీస గిట్టుబాటు ధరలు అందాలని.. వలస కూలీలు, కార్మికుల కోసం షెల్టర్లు ఏర్పాటు చేసి మెనూ ప్రకారం మంచి భోజనం పెట్టాలని జగన్‌ ఆదేశించారు.

Similar News