ఇటలీలో అత్యధిక కరోనా మరణాలకు కారణాలు ఇవే..

Update: 2020-03-29 09:02 GMT

గత 24 గంటల వ్యవధిలో ఇటలీ 889 మరణాలను నమోదు చేసింది, దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 10,023 కు చేరుకుంది. COVID-19 ద్వారా ఇటలీ ఇప్పటివరకు అత్యధిక మరణాలను నమోదు చేసింది, స్పెయిన్ 5,820 మరణాలతో రెండవ స్థానంలో ఉంది.

అలాగే ఇటలీలో 5,974 కొత్త కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం 92,472 కేసులు నమోదయ్యాయి. లక్షకు పైగా కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. అక్కడ డెత్ రేట్ మాత్రం తక్కువగా ఉంది.. ఇక్కడ కేవలం 1700 మరణాలు మాత్రమే ఉన్నాయి. ఇక వైరస్ వ్యాప్తికి కేంద్రంగా ఉన్న చైనాలో మాత్రం 81,997 ద్రువీకరించబడిన కేసులు ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా ఇటలీతో పోల్చుకుంటే మరణాల సంఖ్య తక్కువే అని చెప్పాలి.

ఇటలీలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణాలు చాలానే ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. దేశంలో వ్యాధి ప్రభలుతుందనే అంచనా ఉన్నప్పటికీ అవసరమైన మెడికల్ సామాగ్రి అందుబాటులో లేదు.. దానికి తోడు అనుమానిత కేసులను కూడా కాకుండా కేవలం తీవ్రమైన కరోనా వైరస్ కేసులను మాత్రమే వైద్య సిబ్బంది పరిగణలోకి తీసుకుంది.. ఇందుకు కారణం సిబ్బంది కొరతే అని అంటున్నారు. ఇక ఇటలీలో వృద్ధుల జనాభా ఎక్కువ.. పైగా ఈ వ్యాధి ఎక్కువగా వృద్ధులకే సోకింది.. అంతేకాదు వృద్ధులే ఎక్కువగా మరణించారు.

Similar News