ఎమర్జెన్సీపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ

Update: 2020-03-31 05:30 GMT

దేశంలో ఎమర్జెన్సీ విధిస్తారని వస్తున్న వార్తలపై భారత సైన్యం క్లారటీ ఇచ్చింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎమర్జెన్సీ విధిస్తారనే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. కనీసం మాజీ సైనికులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ సేవలు సైతం ఉపయోగించుకోవడం లేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయని తెలిపింది. ఏప్రిల్‌ నెల మధ్యలో దేశంలో అత్యయిక స్థితి విధిస్తారడం అవాస్తవమని ఏడీజీపీఐ తెలిపింది.

Similar News