డిల్లీ క్యాన్సర్ హాస్పిటల్‌లో పనిచేసే డాక్టర్ గారింటికి అమెరికా నుంచి అక్కా బావ వచ్చారు. ఆ ఇంట్లోని కుటుంబసభ్యులందరికీ కరోనా టెస్ట్‌లు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. ఆ డాక్టర్ పనిచేసిన హాస్పిటల్‌ని కూడా మూసివేశారు అధికారులు. డాక్టర్‌ని కలిసిన పేషెంట్లతో పాటు ప్రతి ఒక్కరిని క్వారంటైన్‌కు తరలించి ఆసుపత్రిని శానిటైజ్ చేస్తున్నారు సిబ్బంది.
ఇప్పటికే ఢిల్లీలో 120 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు మరణాలు ఉన్నాయి. మంగళవారం ఒక్కరోజే మర్కాజ్ నిజాముద్దీన్ నుంచి 24 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ కరోనా వైరస్ హెచ్చరికలను ధిక్కరించి మార్చిలో మతపరమైన ప్రార్థనలు జరిగాయని, ఈ ప్రార్థనల నిమిత్తంగా దేశ విదేశాలనుంచి అనేక మంది హాజరయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.