వావ్ బన్నీ.. మీ డ్యాన్స్ సూపర్: బాలీవుడ్ బ్యూటీ ట్వీట్

Update: 2020-03-31 19:47 GMT

బుట్టబొమ్మ పాటకు అంత బాగా ఎలా డ్యాన్స్ చేయగలిగారు అంటూ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ అల్లు అర్జున్‌ని ప్రశంసలతో ముంచెత్తింది. అల వైకుంఠపురం పాటలు, డ్యాన్సులు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ని కుర్చీల్లో నిలవనీయలేదు. ఇక బుట్టబొమ్మ పాటకు బాలీవుడ్ తారలు సైతం స్టెప్పులేసి మురిసిపోయారు. కానీ దిశాకు ఒకింతం ఆశ్చర్యం, మరికొంత అనుమానం కలిగాయి. అదే విషయాన్ని ఇన్‌స్టాలో ప్రశ్నించింది. దానికి బన్నీ బదులిస్తూ.. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. అందులో మంచి మ్యూజిక్ దొరికితే స్టెప్ వేయకుండా ఎలా ఉంటాను.. మీ ప్రశంసకు ధన్యవాదాలు అంటూ దిశాకు రిప్లై ఇచ్చాడు. కాగా, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్.

Similar News