LPG TROUBLES: ముదిరిన సంక్షోభం.. గ్యాస్‌ ట్రబుల్‌ డబుల్‌

రోజురోజుకు ముదురుతున్న గ్యాస్ సంక్షోభం

Update: 2026-03-13 14:35 GMT

దే­శం­లో ఎల్పీ­జీ సం­క్షో­భం రో­జు­రో­జు­కూ ము­దు­రు­తు­న్న­ది. దే­శం­లో గ్యా­స్‌ కొరత లే­దం­టూ కేం­ద్రం ఒక వైపు ప్ర­క­ట­న­లు చే­స్తుం­డ­గా, క్షే­త్ర­స్థా­యి పరి­స్థి­తు­లు అం­దు­కు భి­న్నం­గా ఉన్నా­యి. వా­ణి­జ్య, గృహ అవ­స­రా­ల­కు వి­ని­యో­గిం­చే ఎల్పీ­జీ సి­లిం­డ­ర్ల­కు తీ­వ్ర కొరత ఏర్ప­డిం­ది. దే­శ­వ్యా­ప్తం­గా అనేక నగ­రా­ల్లో గ్యా­స్‌ కోసం ప్ర­జ­లు ఏజె­న్సీల ముం­దు బా­రు­లు తీరి కని­పి­స్తు­న్నా­రు. ఇప్ప­టి­కే వా­ణి­జ్య గ్యా­స్‌ సి­లిం­డ­ర్‌­కు తీ­వ్ర కొరత ఏర్ప­డ­టం­తో పలు హో­ట­ళ్లు, వ్యా­పార సం­స్థ­లు, మె­స్‌­లు, హా­స్ట­ళ్లు మూ­త­ప­డ­గా, మరి­కొ­న్ని పా­క్షి­కం­గా పని­చే­స్తు­న్నా­యి. ఈ వంట గ్యా­స్‌ సెగ ప్ర­ముఖ హో­ట­ళ్ల­కు కూడా తగి­లిం­ది. గ్యా­స్‌ కొ­ర­త­తో దే­శ­మం­త­టా సి­లిం­డ­ర్ల బ్లా­క్‌ మా­ర్కె­ట్‌­కు తె­ర­లే­చిం­ది. భారీ రే­ట్ల­కు గ్యా­స్‌ అమ్ము­తూ దళా­రు­లు దం­డు­కుం­టు­న్నా­రు. ఇప్ప­టి­కే పలు రా­ష్ర్టా­ల్లో గ్యా­స్‌ కొరత ఏర్ప­డ­గా, పె­ట్రో­ల్‌, డీ­జి­ల్‌­కు కూడా కొరత వస్తుం­ద­న్న భయం­తో పె­ట్రో­ల్‌ బం­క్‌ల ముం­దు వా­హ­న­దా­రు­లు క్యూ­లు కడు­తు­న్నా­రు. దే­శం­లో­ని పలు రా­ష్ర్టా­ల్లో ఎల్పీ­జీ గ్యా­స్‌ ఏజె­న్సీల ముం­దు పౌ­రు­లు సి­లిం­డ­ర్ల­తో క్యూ­లు కడు­తు­న్న దృ­శ్యా­లు మీ­డి­యా­లో వై­ర­ల్‌ అవు­తు­న్నా­యి.. ఇప్పు­డు పలు పె­ట్రో­ల్‌ బం­క్‌ల ముం­దు కూడా అలాం­టి దృ­శ్యా­లే కన్పి­స్తు­న్నా­యి. దే­శం­లో పె­ట్రో­ల్‌, డీ­జి­ల్‌, కి­రో­సి­న్‌­కు ఎలాం­టి కొరత లే­ద­ని కేం­ద్రం పా­ర్ల­మెం­ట్‌ సా­క్షి­గా ప్ర­క­టిం­చి­నా పౌ­రు­లు నమ్మి­న­ట్టు కన్పిం­చ­డం లేదు.

బ్లాక్ మార్కెట్కు సిలిండర్లు

బీ­హా­ర్‌­లో గృ­హా­వ­స­రా­ల­కు వి­ని­యో­గిం­చే గ్యా­స్‌ సి­లిం­డ­ర్‌ రూ.1,800, వా­ణి­జ్య సి­లిం­డ­ర్‌­ను రూ.4,000కు బ్లా­క్‌­మా­ర్కె­ట్‌­లో వి­క్ర­యి­స్తు­న్నా­రు. ఇప్ప­టి­కే పలు హో­ట­ళ్లు రె­స్టా­రెం­ట్లు ఇం­డ­క్ష­న్‌ స్ట­వ్‌­ల­పై ఆహా­ర­ప­దా­ర్ధా­ల­ను వం­డ­టం ప్రా­రం­భిం­చా­యి. వా­ణి­జ్య సి­లిం­డ­ర్‌ ధర రూ. 1,918 ఉం­డ­గా, భో­పా­ల్‌­లో­ని బా­ర్కే­డా పటా­నీ­లో­ని భా­ర­త్‌ గ్యా­స్‌ ఏజె­న్సీ బహి­రం­గం­గా­నే రూ.4,000కు అమ్ము­తు­న్న­ట్టు ఒక ఆం­గ్ల మీ­డి­యా వె­ల్ల­డిం­చిం­ది. అలా­గే రూ.918 ఉండే గృ­హా­వ­స­రాల సి­లిం­డ­ర్‌­ను రూ.1700 నుం­చి 1,800కు అమ్ము­తు­న్నా­రు. బ్లా­క్‌­మా­ర్కె­ట్‌­ను ని­రో­ధిం­చ­డా­ని­కి ప్ర­భు­త్వం అత్య­వ­సర వి­ని­యో­గ­దా­రుల చట్టా­న్ని అమలు చే­స్తు­న్న­ప్ప­టి­కీ గ్యా­స్‌ ఏజె­న్సీ­లు వా­టి­ని పట్టిం­చు­కో­వ­డం లేదు. ఏజె­న్సీ ఉద్యో­గు­లు, బ్లా­క్‌­మా­ర్కె­టీ­ర్లు, ఏజె­న్సీ ని­ర్వా­హ­కు­లు అప్పు­డే గ్యా­స్‌­ను బ్లా­క్‌­లో అమ్మ­డం ప్రా­రం­భిం­చా­రు. అక్ర­మం­గా గ్యా­స్‌­ను రీ­ఫి­ల్లిం­గ్‌ చేసే వారు కూడా ఈ కొరత పరి­స్థి­తు­ల­ను తమకు అను­కూ­లం­గా మా­ర్చు­కుం­టు­న్నా­రు. యూ­పీ­లో రో­జం­తా లై­న్‌­లో ని­ల­బ­డి­నా లభిం­చ­ని సి­లిం­డ­ర్‌ కూడా 1,600 ఇస్తే వెం­ట­నే దొ­రు­కు­తు­న్న­ద­ని స్థా­నిక మీ­డి­యా వర్గా­లు తె­లి­పా­యి. డె­హ్రా­డూ­న్‌, హల్దా­నీ­ల­లో గ్యా­స్‌ సి­లిం­డ­ర్లు దొ­ర­క్క­పో­వ­డం­తో హో­ట­ళ్లు, రె­స్టా­రెం­ట్‌ ధా­బా­లు, కా­ర్ట్‌ ని­ర్వా­హ­కు­లు తీ­వ్ర ఇబ్బం­దు­లు పడు­తు­న్నా­రు.

మెనూలో కోత

ఇప్ప­టి­కే తమ ఫు­డ్‌ మె­నూ­లో­ని 70 శా­తా­ని­కి పైగా రకా­ల­ను ఆయా సం­స్థ­లు తొ­ల­గిం­చా­యి. గ్యా­స్‌ కొ­ర­త­ను ఎదు­ర్కో­వ­డా­ని­కి ప్ర­త్యా­మ్నా­యా­ల­పై వ్యా­పార సం­స్థ­లు దృ­ష్టి సా­రి­స్తు­న్నా­యి. ఇక హర్యా­నా­లో గృ­హా­వ­స­రాల సి­లిం­డ­ర్‌ మొ­న్న­టి వరకు బు­క్‌ చే­సిన ఒకటి రెం­డు రో­జు­ల్లో వచ్చే­ది. ఇప్పు­డు వారం రో­జు­లై­నా వచ్చే పరి­స్థి­తి లేదు. హి­సా­ర్‌, సో­ని­ప­ట్‌, ఫతే­బా­ద్‌, హన్సీ, పా­ని­ప­ట్‌, కై­తా­ల్‌, రె­వా­రి, ఫరీ­దా­బా­ద్‌­ల్లో­ని గ్యా­స్‌ ఏజె­న్సీల ఎదుట చాం­తా­డు క్యూ­లు ఉన్నా­యి. రా­జ­స్థా­న్‌­లో­ని భి­ల్వా­రా­లో 50 శాతం రె­స్టా­రెం­ట్లు మూ­త­ప­డ్డా­యి. పం­జా­బ్‌­లో గ్యా­స్‌ ఏజె­న్సీల ముం­దు పౌ­రు­లు సి­లిం­డ­ర్లు పట్టు­కు­ని బా­రు­లు తీరి ఉం­డ­టం కన్పిం­చిం­ది. రా­జ­స్థా­న్‌­లో వా­ణి­జ్య గ్యా­స్‌ సర­ఫ­రా­ను ని­లి­పి­వే­య­డం­తో పలు రె­స్టా­రెం­ట్లు, హో­ట­ళ్లు, మె­స్‌­ల­ను మూ­సి­వే­శా­రు. నగ­రం­లో 400 రె­స్టా­రెం­ట్లు ఉం­డ­గా, అం­దు­లో సగం గ్యా­స్‌ కొ­ర­త­తో మూ­సి­వే­సి­న­ట్టు రా­జ­స్థా­న్‌ ఫు­డ్‌ అసో­సి­యే­ష­న్‌ అధ్య­క్షు­డు లక్ష్మీ­నా­రా­యణ వ్యా­స్‌ చె­ప్పా­రు. ఎల్పీ­జీ­కి తీ­వ్ర కొరత ఏర్ప­డ­టం­తో పౌ­రు­లు, వా­ణి­జ్య, వ్యా­పార సం­స్థ­లు ప్ర­త్యా­మ్నా­యా­ల­పై దృ­ష్టి సా­రి­స్తు­న్నా­యి. గ్యా­స్‌­కు ప్ర­త్యా­మ్నా­యం­గా వం­ట­చె­ర­కు, బొ­గ్గు­ను వం­ట­కు వి­ని­యో­గిం­చ­వ­చ్చు. అయి­తే ఇప్పు­డు వాటి ధరలు కూడా వే­గం­గా పె­రి­గి­పో­యా­యి. రా­జ­స్థా­న్‌­లో­ని కో­టా­లో మె­స్‌, హా­స్ట­ల్‌ ని­ర్వా­హ­కు­లు బొ­గ్గు, సం­ప్ర­దాయ కొ­లి­మి­ల­ను వా­డ­టం ప్రా­రం­భిం­చా­రు.సా­ధా­ర­ణం­గా మె­స్‌­లు, హో­ట­ళ్లు 35 నుం­చి 40 కి­లోల బరు­వుం­టే కొ­లి­మి­ల­ను తయా­రు చే­స్తా­రు. అయి­తే ఇప్పు­డు వా­టి­కి కూడా డి­మాం­డ్‌ పె­ర­గ­డం­తో అవి దొ­ర­క­డం కష్టం­గా మా­రిం­ది. కొ­ద్ది రో­జు­ల్లో­నే బొ­గ్గు డి­మాం­డ్‌ 12 నుం­చి 15 టన్ను­ల­కు చే­రు­కుం­ద­ని ఒక వ్యా­పా­రి తె­లి­పా­డు. గ్యా­స్‌ కొ­ర­త­తో ఎల­క్ట్రి­క్‌ ఇం­డ­క్ష­న్‌ స్ట­వ్‌, వి­ద్యు­త్‌ పొ­య్యి­ల­కు డి­మాం­డ్‌ బాగా పె­రి­గిం­ది.

Tags:    

Similar News