కరోనావైరస్ తో 'స్టార్ వార్స్' నటుడు మృతి..

Update: 2020-04-01 11:30 GMT

కరోనావైరస్ సోకడంతో స్టార్ వార్స్ నటుడు ఆండ్రూ జాక్ మృతి చెందాడు.. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఇటీవల వైరస్ సోకడంతో బ్రిటన్ లోని సర్రే ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేరారు. బుధవారం చికిత్స పొందుతూ మరణించాడని ఆయన ప్రతినిధి బుధవారం చెప్పారు. ప్రస్తుతం నటనకు స్వస్తి చెప్పి మాండలికం కోచ్‌గా పనిచేస్తున్నారని.. ఈ క్రమంలో మంగళవారం లోని ఆసుపత్రిలో మరణించినట్లు జాక్ ఏజెంట్ జిల్ మెక్‌కల్లౌగ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా కొంతకాలంగా ఆండ్రూ.. తనకు ఇష్టమైన థేమ్స్ లోని పురాతన హౌస్ బోట్లలో ఒకదానిలో నివసిస్తున్నారు.

ఆస్ట్రేలియాలో నిర్బంధంలో ఉన్న అతని భార్య గాబ్రియెల్ రోజర్స్.. భర్త మరణం గురించి తెలుసుకొని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.. అందులో 'ఆండ్రూ జాక్ 2 రోజుల క్రితం కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అతను ఎటువంటి బాధతో లేడు, మరియు తన కుటుంబం అంతా తనతోనే ఉందని తెలిసి అతను శాంతియుతంగా వెళ్ళిపోయాడు' అని పేర్కొన్నారు.

Similar News