ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోన్న కరోనా మహమ్మారి విజృంభణ

Update: 2020-04-02 09:00 GMT

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం సేకరించిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా, 44,000 మందికి పైగా మరణించారని సుమారు 900,000 మంది వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు.. అంతేకాదు లక్షా తొంభైవేల మందికి పైగా కోలుకున్నారు అని తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ లో , మరణాల సంఖ్య 4,000 దాటింది మరియు ధృవీకరించబడిన కేసుల సంఖ్య 200,000 దాటింది. అలాగే స్పెయిన్ అత్యధిక రోజువారీ మరణాల సంఖ్యను నమోదు చేసింది - మరో 864 మందికి అంటువ్యాధులు సోకడంతో కేసుల సంఖ్య 102,136 కు పెరిగింది. ఇరాన్ మరణాల సంఖ్య 138 కొత్త మరణాలతో 3,000 దాటింది.

Similar News