దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో సీబీఎస్ఈ పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. తాజాగా సీబీఎస్‌ఈ స్కూళ్లలో చదివే విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఎలాంటి పరీక్షలు లేకుండా ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయాలని హెచ్‌ఆర్డీ ఆదేశించింది.
9, 11వ తరగతి స్టూడెంట్స్‌ని మాత్రం.. పాఠశాల స్థాయిలో నిర్వహించే ప్రాజెక్టులు, పీరియడిక్ టెస్టులు, టర్మ్ ఎగ్జామ్స్ ఫలితాల ఆధారంగా ప్రమోట్ చేయాలని సూచించింది.