కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటానికి హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ కలిసి వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వానికి ఉపశమనం మరియు పునరావాస చర్యలకు సహకరించడానికి పిఎం-కేర్స్ ఫండ్‌కు రూ .150 కోట్లు హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యువేషన్స్ ఫండ్ (పీఎం-కేర్స్ ఫండ్)కి ఈ సాయాన్ని అందించనునున్నామని హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ చైర్మన్ దీపక్ పరేక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ వంతు సాయంగా బాధితుల ఉపశమన, పునరావాస చర్యలకు మద్దతుగా నిలవాలని భావిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సాయుధ మరియు పారామిలిటరీ దళాలు, స్థానిక పోలీసులు, ఆరోగ్య నిపుణులు మరియు పారిశుద్ధ్య కార్మికులది ఆదర్శప్రాయమైన కృషి.. వీరంతా మహమ్మారిపై పోరాడటానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు అని హెచ్‌డిఎఫ్‌సి అభినందించింది.