కేరళలో మద్యం అమ్మకాలపై హైకోర్టు స్టే

Update: 2020-04-02 15:32 GMT

మందుబాబుల బాధలు దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేసిన వారికే మద్యాన్ని ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం. దాంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఆ ఆనందం ఒకరోజు వ్యవధిలోనే ఆవిరైపోయింది. మద్యం అమ్మకాలపై మూడు వారాల పాటు స్టే విధిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జయశంకర్‌ నంబియార్‌, శజ్జీ పీ చాలేతో కూడిన ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తీర్పును వెలువరించారు.

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరపొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో మందుబాబులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. నిజానికి కేరళలో మందులేక విత్ డ్రాళ్ లక్షణాలతో కొంతమంది బాధపడ్డారు. ఒకరిద్దరు మృత్యువాత పడ్డారు కూడా. దీంతో వైద్యుల సూచన మేరకు మద్యం అమ్మకాలకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

Similar News