కరోనా మహమ్మారికి పద్మశ్రీ అవార్డు గ్రహీత బలయ్యారు. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో
జరిగింది. అమృత్‌సర్ కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్ ఖల్సా (62)కు గత కొన్ని రోజుల కిందట కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చింది. దాంతో నిర్మల్ సింగ్ ను పంజాబ్‌లోని గురునానక్ దేవ్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కొన్ని రోజులపాటు చికిత్స అందిస్తున్నారు.
అయితే గురువారం ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. దాంతో గురువారం తెల్లవారుజామున నిర్మల్ సింగ్ మరణించినట్లు వైద్యులు వెళ్లడించారు. కాగా నిర్మల్ సింగ్ ఖల్సా పంజాబ్‌లోని ప్రఖ్యాత అమృత్‌సర్ దేవాలయంలో అత్యున్నత పదవిలో తన సేవలందించారు. ఆయన సేవలకుగాను భారత ప్రభుత్వం 2009లో పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేసింది.