సాధారణ మాస్కులు సరిపోతాయి: ట్రంప్

Update: 2020-04-04 13:54 GMT

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ప్రజలు మరో నాలుగు వారాలపాటు ఇళ్లలోనే ఉండి తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవాలని అధ్యక్షుడు ట్రంప్ సూచిస్తున్నారు. ఇదే విషయమై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సూచించిన మార్గదర్శకాలను పాటించాలని కోరారు.

ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, అయితే అవి మెడికల్ మాస్కులు కానవసరం లేదని, సాధారణ మాస్కులు సరిపోతాయని అంటున్నారు. లేదా కర్చీఫ్ అయినా సరిపోతుందని అన్నారు. మెడికల్ మాస్కులు, ఎన్-95 మాస్కులు అత్యవసర విభాగాల్లో పనిచేసే వారికి, వైద్య సిబ్బందికి మాత్రమే అవసరమవుతాయని ఆయన వివరించారు. మాస్కులు ధరించడంతో పాటు, సామాజిక దూరాన్ని పాటించడం కూడా చాలా అవసరమని సూచించారు. వీలైనంతవరకు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని దేశ పౌరులను హెచ్చరించారు. దేశ ప్రజలందరినీ మాస్కులు ధరించమనీ మరీ మరీ చెబుతున్న దేశాక్ష్యుడినైన తాను మాత్రం మాస్క్ ధరించనని ఖరాఖండిగా చెబుతున్నారు.

Similar News