30 శాతం మంది తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన వారే: కేంద్రం

Update: 2020-04-04 19:34 GMT

దేశంలోని మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో 30 శాతం మంది ఢిల్లీలో తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన వాళ్ళే ఉన్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో ఉన్న కరోనా కేసులను పరిశీలించి చూస్తే.. 1023 పాజిటివ్ కేసులు తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన వారేనని తెలిపారు. అవి మొత్తం కేసుల్లో 30 శాతం ఉన్నాయని తెలిపారు.

ఇప్పటివరకు దేశంలో 2,902 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. అందులో శుక్రవారం నుంచి 601 పాజిటివ్ కేసులున్నాయని తెలిపారు. శుక్రవారం 12 మరణాలు సంభవించగా.. మొత్తం 68 కి చేరుకున్నాయని అన్నారు. ఇప్పటివరకు 183 మంది కోలుకున్నారని సమాచారమిచ్చారు.

అటు.. తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన వారిని.. వారు కాంటాక్ట్ అయినవారితో సహా.. మొత్తం 22,000 మందిని క్వారంటైన్ లో పెట్టమని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

Similar News