అమేథిలో లాక్‌డౌన్ ఉత్తర్వుల ఉల్లంఘన.. 13 మంది అరెస్ట్

Update: 2020-04-07 19:54 GMT

ఉత్తర ప్రదేశ్‌లోని అమేథి జిల్లాలో లాక్‌డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘించిన 13 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఒక సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు. లాక్డౌన్ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ 13 మంది గౌరీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూరగాయల మార్కెట్ వద్ద గుమిగూడారని సూపరింటెండెంట్ అఫ్ పోలీసు ఖ్యతి గార్గ్ తెలిపారు. దీంతో ఐపిసిలోని వివిధ విభాగాల కింద వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు.

Similar News