ట్రంప్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ స్పందన

Update: 2020-04-07 20:14 GMT

హైడ్రాక్సీ క్లోరోక్విన్ తమకు పంపించకపొతే భారత్ పై ప్రతీకారం తీసుకుంటామని ప్రకటించిన ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను అమెరికాకు ఎగుమతి చేసేందుకు అనుమతించాలంటూ అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీని కోరారు. ఆ తరువాత భారత్.. ఫార్మా ఎగుమతులపై మరిన్ని ఆంక్షలు విధించడంతో అమెరికా ప్రతీకారం తీర్చుకోవచ్చు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అయితే ట్రంప్ వ్యాఖ్యాలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తాజాగా రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు. స్నేహంలో ప్రతీకారం ఉండదని కామెంట్ చేసిన ఆయన.. సహాయం కోరిన అన్ని దేశాలకు భారత్ చేయూత నందించాలన్నారు. అయితే.. భారత్ కు అవసరమైన స్థాయిలో నిల్వలు ఉంచుకొని.. మిగతా సరుకు ఎగుమతి చేయాలని అన్నారు.

అయితే.. ప్రపంచంలో కరోనా విలయతాండవం చేస్తున్న దృష్యా భారత్.. పెద్ద మనసుతో మందుల ఎగుమతులను అనుమతించిన సంగతి తెలిసిందే.

Similar News