ఏప్రిల్ 30 వరకు 15 జిల్లాలు సీజ్..

Update: 2020-04-08 20:35 GMT

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో వైరస్ ప్రాంతాలుగా గుర్తించిన 15 జిల్లాల్లోని అన్ని కోవిడ్ 19 హాట్‌స్పాట్‌లను ఏప్రిల్ 30 వరకు సీల్ చేస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ప్రజలు వారికి కావలసిన వస్తువులను హోమ్ డెలివరీ ద్వారా తెప్పించుకోవాలని కోరింది. ఈ జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని ఇన్ఫర్మేషన్ డైరక్టర్ షిషిర్ తెలిపారు. అదనపు ప్రధాన కార్యదర్శి మీడియాతో మాట్లాడుతూ ఆగ్రా, లక్నో, ఘజియాబాద్ ,గౌతమ్ బుద్ద నగర్, కాన్పూర్, వారణాసి, షామ్లీ, మీరట్, బరేలీ, బులాండ్ షహర్‌తో సహా 15 జిల్లాల్లో అనేక కోవిడ్ కేసులు నమోదైనట్లు చెప్పారు. ఈ ప్రాంతాలకు వైద్య వాహనాలు మాత్రమే అనుమతించబడతాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. కాగా, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 343కు పెరిగింది.

Similar News