రాబోయే గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి భారతీయులంతా సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రతను గమనిస్తే పరిస్థితి అదుపులోకి రావడానికి ఇంకా 5 నుంచి 6 వారాల సమయం కావాలని ఆయన అన్నారు. కరోనా వలన ఇతర దేశాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మనకు రాకూడదని ఆయన కోరుకున్నారు. భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని.. దానికి తగ్గట్టు.. దేశవ్యాప్తంగా మరిన్ని క్వారంటైన్ సెంటర్లు, ఐసోలేషన్ బెడ్స్, ల్యాబ్స్, టెస్టింగ్ కిట్స్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రం మరిన్ని రోజుల లాక్‌డౌన్ అమలుకు సిద్ధంగా ఉందని.. ప్రజలు దానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.