Roja : రోజా అనుచిత వ్యాఖ్యలు.. దుమ్మెత్తిపోస్తున్న ప్రజలు..

Update: 2026-03-05 07:00 GMT

అధికారం పోయినా సరే వైసీపీ నేతల తీరు అస్సలు మారట్లేదు. అధికారంలో ఉన్నప్పుడు బూతులతో రెచ్చిపోయిన రోజా, కొడాలి నాని, అనిల్, అంబటి రాంబాబు లాంటి వారి అరాచకాలు ఎవరూ చూడలేకపోయారు. వాళ్ల తీరు చూడలేక ప్రజలు అత్యంత దారుణంగా ఓడించారు. అయినా సరే వాళ్ల తీరు అస్సలు మారట్లేదు. తాజాగా మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ.. టీటీడీ చైర్మన్ గారిని పట్టుకుని నాలుగు పీకుతా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసలు ఆమె మాటలు విన్న వారంతా దారుణంగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఎందుకంటే ఒక మహిళా నేత అయి ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. మొన్ననే అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్టు పేట్రేగిపోతే.. ఎలాంటి పరిణామాలు జరిగాయో చూశాం. కాబట్టి రోజా రాజకీయంగా హుందాగా విమర్శించాలి తప్ప.. ఇలాంటి దిక్కుమాలిన మాటలతో రెచ్చిపోవడం ఏంటని మండిపడుతున్నారు జనాలు. రోజా ఇలాంటి మాటలు చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని.. ఆమె వ్యక్తిగత ఇమేజ్ పోతుంది తప్ప ఎవరికీ ఎలాంటి నష్టం లేదని అంటున్నారు కూటమి నేతలు.

ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు చేయాలి, ఒకవేళ స్కాములు చేసి ఉంటే సాక్ష్యాలు చూపించాలి. అంతే గానీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారాలు చేయడం.. కూటమి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలా బూతులు తిట్టడం వారికి పరిపాటి అయిపోయింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, బూతుల కామెంట్లు ఎన్ని చేసినా సరే ఎవరి వ్యక్తిగత ఇమేజ్ తగ్గదు. ఎందుకంటే టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు గారు పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారో అందరికీ తెలుసు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్నారు.

టీటీడీలో అత్యంత పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సకల సౌకర్యాలు ఏర్పాటు చేయించారు. అన్నప్రసాదం దగ్గరి నుంచి లడ్డూ ప్రసాదం దాకా అత్యంత క్వాలిటీతో అందిస్తున్నారు. టీటీడీ ప్రతిష్టను పెంచుతున్నారు. మాజీ మంత్రి రాంబాబే స్వయంగా తిరుమలలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయంటూ కొనియాడారు కదా. మరి ఆ విషయం రోజాకు, కొడాలి నానికి తెలియదా అంటున్నారు సామాన్య భక్తులు. ఇంత చేస్తున్న బీఆర్ నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం వల్ల రోజా, కొడాలి నాని వ్యక్తిగత ఇమేజ్ తగ్గుతుంది తప్ప బీఆర్ నాయుడి గారికి ఎలాంటి ఇబ్బంది లేదు.

Tags:    

Similar News