ప్రపంచ దేశాలను కరోనా గజగజ వణికిస్తోంది. ఈ కరోనా మహమ్మారి భారత్ పైన కూడా పంజా విసిరింది. ఈ వైరస్ నుండి భారత దేశ ప్రజలను కాపాడుకోవటం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించి అమలు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న ప్రజలు లాక్ డౌన్ ఇంకా కొనసాగిస్తారా ? లేకా ఎత్తివేస్తారా ? అన్న అంశంపై క్లారిటీ రాక సతమతమవుతున్నారు. లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనా ప్రబలుతుందేమో అన్న భయం ఒక వైపు , లాక్ డౌన్ కొనసాగిస్తే ఇంకా ఆర్ధికంగా చితికిపోతామన్న భయం వెరసి లాక్ డౌన్ విషయంలో అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు కూడా సందిగ్ధానికి లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో మణిపూర్ ప్రజలకు ఆ రాష్ట్ర సర్కార్ లాక్ డౌన్ నుంచి ఒక రోజు మినహాయింపునిచ్చింది.
ఈస్టర్, చెయిరావోబా పండుగల నేపథ్యంలో మణిపూర్ వాసులకు సర్కార్ ఒక రోజు బయటకు వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో మణిపూర్ లోని మార్కెట్లు, షాపులు, ఇతర వాణిజ్యసముదాయాలు జనాల రాకతో కిటకిటలాడుతున్నాయి. ప్రజలు వారికి అవసరమైన సామాగ్రి, నిత్యవసరాలు కొనుగోలు చేసుకుంటున్నారు.