రోడ్డు మీద ఉమ్మి వేశాడని స్టేషన్‌కి..

Update: 2020-04-11 16:35 GMT

గీ కరోనా వచ్చి మన స్వేచ్ఛని హరించిందని కొందరు బాధపడుతుంటే.. కొందరు మాత్రం మనకి చాలా మంచి విషయాలు కూడా నేర్పుతుందని అంటున్నారు. ఇది వరకు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం, తిన్నవి పడేయడం.. పైగా ఎవరూ చూడడట్లేదని ఎవరికి వాళ్లు సర్థి చెప్పుకోవడం.. నేనొక్కడినేనా పడేసేది .. సూటు, బూటు వేసుకున్న సార్లు కూడా అదే పని చేస్తున్నారుగా అని అనుకోవడం. మరి ఇప్పుడా పప్పులు ఉడకవు. తాజాగా తెలంగాణ వరంగల్ జిల్లా దామెర మండలంలో రోడ్డుపై ఉమ్మి వేసిన ఓ వ్యక్తి కానిస్టేబుల్ కంటికి చిక్కాడు. అంతే అతడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కి పట్టుకుపోయారు. తుమ్మినా, దగ్గినా ఆఖరికి ఉమ్మినా కూడా వైరస్ ఎక్కడ మనకి అంటుకుంటుందో అని స్థానికులు కూడా కలవర పాటుకు గురవుతున్నారు.

Similar News