రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి కనగరాజ్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్నటి ఆర్డినెన్స్ ప్రకారం హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్ మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. 1973 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్న జస్టిస్ కనగరాజ్ 1997లో మద్రాస్ హైకోర్ట్ జడ్జిగా నియమితులయ్యారు.