జీవితాంతం వారికి రుణపడి ఉంటా: బ్రిటన్ ప్రధాని

Update: 2020-04-12 18:07 GMT

కరోనా నుంచి కోలుకుంటున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. తనకు చికిత్స అందించిన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ఈ మేరకు హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. వారం క్రితం బోరిస్‌ కరోనా లక్షణాలతో హాస్పిటల్‌లో చేరిన బ్రిటన్ ప్రధాని.. తరువాత వ్యాధి లక్షణాలు తీవ్రంకావడంతో ఏప్రిల్ 6న ఐసీయూలో ఆయనకు చికిత్స అందించారు. తరువాత ఆరోగ్యం కోలుకున్న తరువాత ఏప్రిల్ 9న జనరల్ వార్డుకు మార్చారు. శుక్రవారం నాటికి ఆయన స్వయంగా లేచి నడించారని.. ఆయన ఆరోగ్యం క్రమంగా కుదటపడుతుందని ఆయన అధికారిక కార్యాలయం వెల్లడించింది.

అయితే ఐసీయూ నుంచి బయటకివచ్చిన తరువాత మొదటిగా తనకు చికిత్స చేసిన వైద్యులను ఉద్దేశించి మాట్లాడారు. తనకు వైద్యం అందించిన వాళ్లకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని బోరిస్ అన్నారు. ‘‘వాళ్లు నాకు చేసిన సేవకు కేవలం థ్యాంక్స్ చెబితే సరిపోదు. నా జీవితాంతం వారికి రుణపడి ఉంటాను’’ అని ఆయన తెలిపారని.. హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది.

Similar News