లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి.. 500 సార్లు క్షమాపణలు కోరిన విదేశీయులు

Update: 2020-04-12 14:31 GMT

లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన విదేశీయులు.. 500 సార్లు క్షమాపణలు చెప్పారు. ఉత్తరాఖండ్ లోని తపోవన్ ప్రాంతంలో నివసిస్తున్న పాలయూ దేశాలకి చెందిన కొందరు విదేశీయులు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి, రోడ్ల మీద తిరుగుతున్నారు. దీనిని గమనించిన అక్కడి పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనితో ఆ విదేశీ బృందం.. తాము లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించామని, అందుకు క్షమించాలని కోరుతూ ఒక్కొక్కరూ కాగితం మీద 500 సార్లు రాశారు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు తెలిపారు. కాగా.. కరోనా విజృంభిస్తున్న సమయంలో 21 రోజులు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే

Similar News