గవర్నర్ హక్కులపై కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు

Update: 2020-04-13 17:08 GMT

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్‌‌ నిర్ణయాన్ని సమర్ధించిన సుప్రీంకోర్టు.. బల నిరూపణ చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం గవర్నర్‌కు ఉందని స్పష్టం చేసింది. జస్టిస్ డీ.వై. చంద్రచూడ్ మరియు హేమంత్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది.

అసెంబ్లీ సమావేశాలు నిర్వహించమని చెప్పే అధికారం గవర్నర్‌కు ఉంది కానీ, బల నిరూపణకు ఆదేశించే హక్కు మాత్రం లేదని అప్పటి కమల్‌నాథ్ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది. దీనితో..1994లో తీర్పునిచ్చిన ఎస్.ఆర్. బొమ్మై కేసును ఆధారంగా చేసుకొని బల నిరూపణకు ప్రభుత్వాన్ని ఆదేశించే హక్కు గవర్నర్‌కు ఉంటుందని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది.

Similar News