భారత గబ్బిలాల్లో కరోనా వైరస్‌

Update: 2020-04-15 12:43 GMT

కరోనా వైరస్.. ఇప్పడు ఈ పదం వింటేనే ప్రపంచం అంతా వణుకుతోంది.. నివారణే తప్ప మందే లేని ఈ వ్యాధి ప్రజల్ని తీవ్రమైన భయబ్రాంతులకు గురిచేస్తోంది. లక్షలాది మంది ఈ వైరస్ భారిన పడుతున్నారు. అయితే ఈ వైరస్ దేని వలన వస్తుందో ఇప్పటికి కనిపెట్టలేదు.. కానీ గబ్బిలాల ద్వారా వస్తుందని మాత్రం అంగీకరిస్తున్నారు పరిశోధకులు. చైనాలో వుహాన్ అడవుల్లో ఉండే గబ్బిలాల ద్వారా ఇది ప్రపంచానికి సోకిందని చెబుతున్నారు. అయితే భారత్ లో ఉండే ఫ్లయింగ్‌ ఫాక్స్‌, రౌసెటస్‌ గబ్బిలాల్లోను కరోనా వైరస్ ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఈ రెండు రకాల గబ్బిలాల్లో కరోనా వైరస్‌ కనిపించిందని.. వీటిలో ఈ సూక్ష్మజీవులను గుర్తించడం ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు..

ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. అయితే ఈ తరహా గబ్బిలాలు కేరళ, తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఈ రెండు జాతులకు చెందిన 25 గబ్బిలాలను సేకరించి వాటి రక్త నమూనాలపై పరిశోధన చేశారు.. దాంతో వీటిలో కరోనా వైరస్‌ కనిపించింది. ఈ వైరస్‌ నిర్ధారణకు ఉపయోగించే ‘రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ చైన్‌ రియాక్షన్‌’ (ఆర్‌టీ-పీసీఆర్‌) పరీక్షలు నిర్వహించినప్పుడు ‘పాజిటివ్‌’ ఫలితాలు వచ్చాయి. అయితే ఈ రకం కరోనా వైరస్‌ వల్ల మానవుల్లో ఇన్‌ఫెక్షన్లు కలుగుతాయా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉందని అంటున్నారు. వాస్తవానికి కేరళలో 2018 -19 సంవత్సరంలో నిఫా వైరస్ సోకింది. ఈ వైరస్ స్టెరోపస్ జాతుల గబ్బిలాలలో నిఫా వైరస్ ఉద్భవించింది.

Similar News