బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే ఖాన్ సోదరి ఫరాఖాన్ అలీ ఇంటి పనిమనిషికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి, ఫరా కుటుంబ సభ్యులందరికీ కరోనా టెస్టులు చేసి ఐసోలేషన్‌లో ఉంచారు. జ్యువెలరీ డిజైనర్‌గా పని చేస్తోన్న ఫరా.. అధికారుల పని తీరును ప్రశంసిస్తున్నారు. వైరస్ లక్షణాలున్నాయని తేలగానే అధికారులు, వైద్యులు స్పందించిన తీరు అమోఘం అని ఫరా ట్వీట్ చేశారు. అధికారులు రోగిని తరలించిన విధానం ప్రశంసనీయం. వారు దయ, మానవత్వంతో వ్యవహరించారు అని పేర్కొన్నారు. ఫరా డీజే అఖిల్‌ని వివాహం చేసుకున్నారు.