ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తిచెందుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో పని చేస్తున్న ప్రభుత్వ వైద్యురాలికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ డాక్టర్ గుంటూరు సిటీలోని గోరంట్ల ఫీవర్ హాస్పిటల్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే సదరు డాక్టర్.. బ్రాడీపేటలోని వర్కింగ్ లేడిస్ హాస్టల్‌లో ఉంటున్నారు. వైద్యురాలికి కరోనా పాజిటివ్ అని బుధవారం నిర్ధారణ కావటంతో హాస్టల్‌లో ఉన్న మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.