కరోనా కట్టడికి మరో వినూత్న ప్రయత్నం చేస్తున్న కేరళ

Update: 2020-04-16 13:39 GMT

దేశంలో కరోనా ముందుగా అడుగుపెట్టిన కేరళలో.. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేస్తున్న విధానం ఆదర్శంగా నిలుస్తుంది. వినూత్న చర్యలు తీసుకుంటూ ఆ మహమ్మారి ప్రబలకుండా చేస్తున్నారు. ఇప్పటివరకు 387 కేసులు నమోదయినప్పటికీ.. 218 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు అంటే.. ఆ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలే కారణం. కరోనా మరణాలు కూడా 3కే పరిమితమైయ్యాయి.

ఆ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేరళ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఆ రాష్ట్ర పర్యాటక రంగంలో వాడే హౌస్‌బోట్లను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చనుంది. ఏప్రిల్‌ చివరి నాటికి రెండు వేల ఐసోలేషన్‌ వార్డులు సిద్ధం చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ప్రతిపాదనను సంతోషంగా అంగీకరిస్తున్నట్లు ఆల్‌ కేరళ హౌస్‌బోట్‌ ఓనర్స్‌ అండ్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది.

Similar News