దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో .. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని వారిపై అదనపు భారం పడకుండా ఏటీఎం సర్వీస్ ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఎస్‌బీఐ ఏటీఎం కార్డులతో ఎన్నిసార్లయినా నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం లభించింది.
దీంతో పాటు ఏటీఎం ద్వారా ఎస్‌బీఐ, ఇతర బ్యాంకు ఏటీఎంలలో లావాదేవీలు చేస్తే సర్వీసు ఛార్జీలు ఉండవని పేర్కొంది. కరోనా వైరస్ విస్తరణ, లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అయితే ఈ వెసులుబాటు జూన్ 30 వరకే వర్తిస్తుందని ఎస్‌బీఐ తెలిపింది.