కరోనాని జయించిన 106 ఏళ్ల బామ్మ

Update: 2020-04-16 22:08 GMT

కోరలు చాస్తున్నా కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారి బారిన పడి.. కరోనాపై పోరాటంలో 106 ఏళ్ల బామ్మ విజయం సాధించింది. ఇంగ్లండ్‌కు చెందిన 106 ఏళ్ల బామ్మ కోవిడ్‌-19ని జయించి నలుగురికి ఆదర్శంగా నిలిచింది. సెంట్రల్‌ ఇంగ్లండ్‌లో కోనీ టీచెన్‌ అనే బామ్మ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో బర్మింగ్‌హాం సిటీ హాస్పిటల్ లో చికిత్స పొందారు. దాదాపు మూడు వారాల పాటు మహమ్మారితో పోరాడి కోలుకున్నారు. దీంతో కరతాళ ధ్వనుల మధ్య డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది బామ్మను డిశ్చార్జి చేశారు. దీంతో బ్రిటన్‌లో కరోనా నుంచి కోలుకున్న అత్యధిక వయస్సు గల మహిళగా నిలిచారు.

Similar News