లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కుదేలైపోయింది. దీంతో కేంద్రం పలు రంగాలకు చేయుతనిస్తుంది. అంకుర సంస్థలతో పాటు చిన్న, మధ్య తరహా సాఫ్ట్ వేర్ సంస్థలకు కేంద్రం కాస్త ఊరట కల్పించింది. ఎస్టీపీఐ భవనాలకు కేంద్రం అద్దెలు రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
మార్చి నుంచి జూన్ వరకు మొత్తం నాలుగు నెలల పాటు అద్దెలు రద్దు చేస్తున్నట్టు కేంద్ర సమాచార శాఖ అధికారిక ప్రకటన జారీ చేసింది.