తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఏప్రిల్ 11న సమావేశం కానుంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురుంచి చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం వుంది. రాష్ట్రంలో ప్రస్తుతం కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకూ యధావిధిగా కొనసాగించడమా? లేక కేంద్ర ప్రభుత్వం ఆలోచన ప్రకారం ఏప్రిల్ 20 నుంచి కొన్ని సడలింపులు ఇవ్వడమా? అన్నఅంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.